2010 అయినా, 1010 అయినా, అంతకు ముందు 0010 అయినా భర్తలు ఒకే మాదిరిగా ఉంటారని ప్రముఖ గ్రీకు తత్వవేత్త చెప్పారు. గ్రీకు పేరు కాబట్టి మనకు గుర్తుండి చావదు. మనకు అందుబాటులో గుర్తు తెచ్చుకొనే కాలం ... ఒక నలభై, యాభై ఏళ్ల కితం ది గా చెప్పుకోవచ్చు. అప్పట్లో భర్త అంటే హాల్ లో ఉండి అవసరం అయినప్పుడు పిలుస్తుండే వారు. భార్య ను పేరు పెట్టి పిలవటం కూడా ఉండేది కాదు. వంటింట్లోనో, పెరట్లోనూ పనికి భార్య పరిమితం అయిన రోజులవి.

ఆ తర్వాత రోజుల్లో భార్య హాలులోకి వచ్చి కంట పడే కాలం వచ్చింది. ఏమేవ్, ఒసేవ్ అనే పిలుపులతో పలకరింపులు సాగేవి. ఈ సమయంలో ఆడవారు కాస్తంత ఎలిమెంటరీ స్కూల్ దాకా చదివుకొన్న రోజులు అన్నమాట. ఇంట్లో కావలసిన సామగ్రి, చీరలు వంటివి కొనే విషయంలో సలహాలకు గొంతు పెగిల్చే రోజులు.ఇక్కడ వీలైతే ఈ సలహాల్ని పాటించే పరిస్థితి. భర్తను అర్థం చేసుకొందామని ప్రయత్నం మొదలెట్టిన ఫేజ్ ఇది.పిల్లలు ఎదిగే కొ్ద్దీ మన వైపు వాయిస్ రేజ్ అవుతూ వచ్చింది.

ఆ తర్వాత తరంలో భార్యను పేరు పెట్టి పిలిచే రోజులు వచ్చేశాయి. ఇందిరాగాందీ, సంజయ్ గాంధీ పుణ్య మా అని దేశమంతా చిన్న కుటుంబాలు విలసిల్లాయి. కుటుంబ సభ్యులు తగ్గటంతో మన కు ధైర్య పెరగసాగింది. ఈ సమయంలో పెళ్లి నాటికే హైస్కూలు దాకా చదువుకోవటం, చుట్టుపక్కల ఊర్లు వెళ్లి రావటం జరుగుతుండేది. ఆ సమయంలో రిలీజైన గుండమ్మ కథ సినిమాలో చెప్పినట్ల.. లేచింది నిద్రలేచింది మహిళా లోకం పాటను బాగా జీర్ణించుకొని, ప్రతీ రోజూ ఉదయాన్నే నిద్ర లేచి భర్త, పిల్లల బద్దకాన్ని చూసి తమ శక్తి కొద్దీ కాసేపు సణక్కొని, తర్వాత ఇంటి పనుల్లో పడి పోయే రోజులు అన్నమాట. ఈ జనరేషన్ లో మన బేచ్ చాలా తెలివిగా వ్యవహరించింది. అప్పటికే దేశమంతా పూర్తి గా ప్రజాస్వామ్యం వచ్చేయటంతో మెజార్టీ ఓట్లు వచ్చిన వారిదే పాలన అన్న సంగతి అర్థం చేసుకొన్నాం. పిల్లల్ని మన వైపు తిప్పుకొని ఉండటం వల్ల క్రమంగా మన మాట చెల్లుబాటు కాసాగింది.

ఇక, మన తరం వచ్చేసరికి సమస్య మరింత జటిలం అయింది. పెళ్లి చేసుకోవటానికి ముందే మనకు భర్త విషయంలో కాస్తంత అవగాహన ఉంటుంది. కానీ, అప్పట్లో భర్త విషయంలో పూర్తి విషయాలు మనకు తెలుసు అని విర్ర వీగుతాం. ముందే బయట చక్కర్లుకొట్టి ఉంటాం కాబట్టి ఆయన గారి జీవితం మన గుప్పిట్లో అనుకొంటాం. కానీ, పెళ్లయ్యాక తెలుగు టీవీ సీరియల్ లో పాత్రల మాదిరిగా రక రకాలకోణాలు బయటకువస్తాయి. ఈ జనరేషన్ లో మ న బ్యాచ్ కాలేజీ ల్లో చదవేయటం, ఉద్యోగాల కోసం ఆపీసుల్లో దూసుకెళుతుంటాం. కెరీర్ లో ఎలా గ్రోత్ సాధించాలో మనకు ఈజీగా అర్థం అవుతుంది. కానీ, భర్తను ఎలా హ్యాండిల్ చేయాలో అంత వీజీగాఅర్థంకాదు. మనం చుడీదార్లు, కుర్తాలు మార్చేసి జీన్లు, గౌన్స్ వైపు పరుగులు తీస్తున్నా - ఏళ్ల తరబడి ప్యాంట్ షర్ట్ లకే పరిమతం అయిపోయిన మగ వారి మీద జాలి కలుగుతుంది. మనం నచ్చినట్లుగా మనం ఉండేందుకు బోలెడు స్వాతంత్ర్యం ఉందనుకొంటాం.

కానీ, భర్త్త అనే బ్రిలియంట్ కూడా చాలా చాక చక్యంగా వ్యవహరిస్తున్నారు. ఏమేవ్ అని ఆర్డర్ వేయించుకొన్న తరం నుంచి , మనం ఆర్డర్ లు పాస్ చేసే స్థాయికి మనం ఎదిగి ఉండచ్చు గాక, కానీ అర్థం కాకుండా వ్యవహరించటంలో భర్త కూడా అంతే తెలివిగా ఎదుగుతూ వచ్చినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మన కెరీర్ విషయంలో అడ్డదిడ్డంగా చొరబడి పోయి సలహాలు ఇచ్చే మహానుభావుడు తన ఉద్యోగం, అక్కడ పరిస్థితులు, ఆఫీసు తలనొప్పులు గురించి షేర్ చేయరు. మనం సెలక్ట్ చేసిన డ్రెస్ తొడుక్కొని బయటకు వెళ్లి తనకు డ్రెస్ సెన్స్ బాగా తెలుసని ఫోజులు కొడుతుంటారు. ఇంట్లో సమానత్వం, గోంగూర అంటూ మెత్తగా కబుర్లుచెప్పే హీరో గార బయటకు వెళ్లాక డామినేషన్ మొదలెడతారు. ఇక, అత్త వారి తరపున బంధువులు వస్తే ఈ వీర శూరత్వానికి అంతే ఉండదు. పాత కాలపు ఎస్ వీ రంగారావు, రావు గోపాల రావు పూనినట్లు ప్రవర్తిస్తారు. సామ్రాజ్యం అంతా వాళ్ల చేతుల్లోనే ఉన్నట్లు ఊగిపోతారు. అసలు అవతల వారి ఇంట్లో కూడా బాస్ లు భార్యలే అని తెలీదు. లోకమంతా ప్రస్తుతం ఈ ట్రెండ్ సాగుతోందని తెలీకుండా ప్రవర్తిస్తారు.
అటు, ఇంట్లో పని చేసుకొని ఆఫీసులకు పరిగెత్తాలి, అక్కడ కెరీర్ లో స్పీడ్ కోసం ఉరుకులు, పరుగులు తీస్తూ పని చేయాల్సిన సమయం ఇది.తప్పదనుకొంటే ఇంటికి కూడా కాస్త పని తీసుకెళ్లాలి. మల్లీ ఇంట్లో నూ ఉరకులు, పరుగులే. ఇల్లాలిదే ఇంటి సామ్రాజ్యం అని డిసైడ్ అయిపోయిన నాటి నుంచీ ఈ ప్రెజర్ ఎక్కువగా ఉంది. పని లో సాయం పడటం ఉండదు కానీ, నవ్వూతూ కామంట్లు విసరటం, ఇల్లు నీట్ గా సర్దటం లేదంటూ వ్యంగంగా కామెంట్లు విసరటం( ఆ పని తానే చేయవచ్చు కదా)వీధిలోకి వెళ్లాకటిఫిన్ బాక్స్ లు సర్దు తూ ఎంతో పని సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వటం చూస్తే అర్థం చేసుకోవటం ఎలాగో అర్థం కాదు.

ఒకటి మాత్రం నిజం .. పూర్వం రోజుల్లో ఏమేవ్, ఒసేవ్ అని అరుస్తూ ఆర్డర్లు వేసి భర్తలు తమకు కావలసినవన్నీ భార్యల చేత చేయించేవారు. ఈ తరంలో మాత్రం.. అది కాదు, ఇది కాదు అంటూ స్వీట్ కబుర్లు చెబుతూ లాలనగా తమ కు కావలసినవన్నీ భార్యల చేత మనః స్ఫూర్తిగా చేయించుకొంటున్నారు. చాకిరీ చేసి కూలబడటం అన్నది కామన్ గా మనకు మాత్రమే దక్కిన రిజల్ట్ అయితే, సమానత్వ సాధకుడిగా పేరుగాంచటం భర్తలు సాధించుకొ్న్న క్రెడిట్. మనం చూసిన యాభై ఏళ్ల కుటుంబ పరిణామంలో భర్త పేరు మారింది తప్పితే సాధింపు ఒకటే అని తేలింది. స్టయిలిష్ గా మనం భర్త పేరు కూడా కలుపుకొని పేరు ని మెయిల్స్ లో, ఆఫీసు కార్యక్రమాల్లో వాడుకొంటాం, ఆయన గారికి మాత్రం ఇదేమి పట్టదు. సో, మేథమెటిక్స్ ను అవసరమైనంత మేరకు అర్థం చేసుకొని, గైడ్‌లు, టెస్ట్ పేపర్ల సాయంతో పరీక్షల్లో ఎక్కువ మార్కులు కొట్టేసినట్లుగానే భర్తల విషయంలోనూ మేనేజ్ చేయటమే మన ముందున్న పని..ఈ అర్థం చేసుకొనే విషయంలో ఎవరైనా చర్చను కొనసాగించవచ్చు..
No comments:
Post a Comment