ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Wednesday, December 22, 2010

పెళ్లీ నీకోన‌మ‌స్కారం..


పెళ్లంటే నూరేళ్ల పంట‌.. తేడా వ‌స్తే అదో పెద్ద తంటా. ఈ సంగ‌తి బాగా జీర్ణించుకొన్న నేటి త‌రం కుర్రకారు బాగా ఆలోచించి కానీ, పెళ్లికి ఓకే చెప్పటం లేదు. బాగా చ‌దువుకొని, చ‌క్కటి ఉద్యోగం దొర‌క పుచ్చుకొన్న త‌ర్వాత స్టేజ్ పెళ్లే అవుతుంది స‌హ‌జంగా. ఈ స‌మ‌యంలో గ్యాప్ తీసుకోవ‌టానికి ఎక్కువ‌గా ఇష్టప‌డుతున్నారు. బ్రహ్మచారి లేదా బ్రహ్మచారిణి జీవితం మీద ఇష్టం అనుకొంటే పొర‌పాటే. త‌గిన జోడీ దొర‌క్క వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే కోరుకొన్న ల‌క్షణాలు ఉన్న జంట కోసం క‌ళ్లు కాయ‌లు కాచి పండ్లు గా మారే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఎవ‌రి కోసం ఈ ప్రేమ మందిరం అంటూ అన్‌నోన్ ప‌ర్సన్ కోసం ఆలోచ‌న‌ల‌తో స‌రిపెట్టేస్తున్నారు.

బుద్దుడు ఈ సంగ‌తి ఎప్పుడో చెప్పేశాడు. కోరిక‌లు దుఃఖానికి మూలం అని ఆయ‌న‌గారు చెప్పారు. ఈ మాట కూడా చ‌క్కటి అమ్మాయి ని పెళ్లి చేసుకొని, ఒక అబ్బాయిని క‌న్నాక బుద్ద భ‌గ‌వానుడు వెల్లడించాడు. అందుచేత ఆయ‌న వ‌ర‌కు ఓకే. ఈ రోజుల్లో చ‌క్కటి అమ్మాయి దొర‌క‌టం ఒక ఎత్తు. ఆమె మ‌న స‌ర్కిల్ లో ఉండాలి. ఆ త‌ర్వాత పెళ్లి విష‌యంలో మ‌న ప్లాట్ ఫామ్ కు స‌రిపోవాలి. ఆ త‌ర్వాత అన్నీ అనుకూలిస్తే పెళ్లి వ‌ర‌కు వెళ్లవ‌చ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ, స‌రిపోయే జోడీ అన్న ప‌దాన్ని అర్థం చేసుకోవ‌ట‌మే క‌ష్టం. ఎందుకంటే చ‌క్కటి అమ్మాయి, చ‌క్కటి అబ్బాయి అనే మాట‌ల‌కు వేర్వేరుగా అర్థాలు చెప్పుకొంటున్నారు. ఎవ‌రి రేంజ్ లో వాళ్లు గ్రీకు వీరుడి కోసం, ప్రేమ సుంద‌రి గురించి ఊహించుకోవ‌చ్చు గాక‌.. కామ‌న్ గా సాగుతున్న అన్వేష‌ణ‌లు ఒకేలా ఉంటున్నాయి...



ఈ త‌రం కుర్రాళ్ల డ్రీమ్స్ ఫైల్ ఓపెన్ చేస్తే మెను ఇలా ఉంద‌న‌వ‌చ్చు... అమ్మాయి ఎర్రగా, నాజూగ్గా ఉండాలి. (మ‌న హీరో చింత‌పండు లా ఉన్నా కానీ, స్వప్న సుంద‌రి ఎర్రగా ఉండాల్సిందే.) అందంగా ఉండ‌ట‌మే కాదు అందంగా క‌నిపిస్తూ ఉండాలి. ఇంజ‌నీరింగ్‌, ఫార్మా, బ‌యో టెక్ వంటి ప్రొఫెష‌న‌ల్ డిగ్రీ ఉంటే మంచిది(నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌చ్చు). కాన్వెంట్ స్కూళ్లో చ‌దువుకొని ఇంగ్లీషు ప‌లుకులు ప‌లుకుతుండాలి. ఉద్యోగం విష‌యంలో స‌గం మంది అటు ఉంటే సగం మంది ఇటు ఉంటున్నారు. వంట బాగా వ‌చ్చి ఉండాలి కానీ, వంట ఇప్పుడే నేర్చుకొంటున్నాన‌ని చెబుతుండాలి. త‌న మీద బాగా ఆధార ప‌డే అమ్మాయి ల‌నే ఇష్టప‌డ‌తారు. అత్తా మామ‌ల్ని బాగా బాగా గౌర‌వించాలి, ఆడ‌ప‌డుచుని, బావ గారుల్ని మ‌ర్యాద చేస్తుండాలి. అత్త వారింట్లో త‌న గౌర‌వం బాగా పెంచుతుండాలి.



ఇక‌, అమ్మాయిల మెను కూడా త‌క్కువేమీ కాదు సుమా... మంచి హైట్ తో స్టయిలిష్ గా ఉండాలి (స‌చిన్ టెండూల్కర్ ల‌కు కాస్త సారీ బ్రద‌ర్‌). ఎక్కువ చ‌దువుకొని ఉండ‌ట‌మే కాకుండా ఇంగ్లీషు లో ఫ‌టా ఫ‌ట్ మాట్లాడుతుండాలి(హైద‌రాబాద్ అమ్మాయిలు హిందీ కు కూడా మార్కులు వేస్తారు) విదేశాల్లో ఉంటే వెంట‌నే స్టాంప్ ప‌డుతుంది. ఒక్కడే కొడుకై ఉండాలి. అత్త గారింట్లో త‌న మ‌ర్యాద ద‌క్కించాలి. ప్రతీ విష‌యంలో త‌న స‌ల‌హా తీసుకోవాలి. ఉద్యోగం, జీతం విష‌యంలో ప‌ట్టింపుల మీద నో కామెంట్‌. త‌న భావాల్ని , ఇష్టాయిష్టాల్ని గౌర‌వించాలి తప్పితే ఇలా ఉండ‌ద్దు, అలా చేయ‌ద్దు అని గీత‌లు గీస్తే ఎక్కడో కాలుతుంది. స్పీడ్ గా ఉంటూ జోక్ లు క‌ట్ చేయ‌టం, గెడ్డం కాస్త పెంచుతూ ట్రిమ్ చేయ‌టం, బైక్ వేగంగా న‌డ‌ప‌టం వంటివి పెళ్లి ముందు ప్లస్ పాయింట్స్, పెళ్లి త‌ర్వాత మైన‌స్ పాయింట్స్..

ఈ మెనూ ఇలాగే ఉండాల‌ని మ‌నం రాజ్యాంగం రాసేయ‌లేం. జ‌న‌ర‌ల్ గా ఆలోచిస్తే మ‌న యూత్ ఆలోచ‌న‌లు అచ్చంగా ఇలాగే సాగుతున్నాయి. స‌మ‌స్య ఈ లిస్ట్ తో కాదు. ఈ లిస్ట్ లో ఉన్న ల‌క్షణాలు ఉన్న అమ్మాయి లేక అబ్బాయి దొర‌క‌టం తోనే ఉంది. కొన్ని కామ‌న్ గా క‌లిసినా, మ‌రికొన్ని డిఫ‌ర్ అవుతుంటాయి. అక్కడే స‌మ‌స్య వ‌స్తుంది. ప‌రీక్షలో 40 మార్కులు వ‌స్తే పాస్ కావ‌చ్చు. ఇక్కడ 75 మార్కుల డిస్టింక్షన్ కూడా క‌లిసి రావ‌టం లేదు. నూటికి నూరు శాతం కోరుకొన్న ల‌క్షణాలు ఉన్న జోడీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పెళ్లి కాని ప్రసాద్ లు, ప్రసాద‌మ్మ లు పెరిగిపోతున్నారు. ఎడ‌మ చేత్తో జాబితా పెట్టుకొని, కుడి చేత్తో క‌ళ్ల జోడు స‌వ‌రించుకొంటూ ( ఈ బాప‌తు బ్యాచ్ కు క‌ళ్ల జోడు ఎక్కువ‌గా ఉంటుంది, కార‌ణం నాకూ తెలీదు) వెద‌కుతుంటారు. ఆగ‌దు ఈ దేశము ఏ నాటికీ,,, ఆగితే సాగ‌దు అని పాడుకొంటూ వెద‌కుతుంటారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ, ఈ కోరిక‌ల రావు లేక కోరిక‌ల రాణి ల‌తో త‌ల నొప్పి, వారి త‌ల్లి దండ్రుల‌కు. డ్రీమ్ గ‌ర్ల్, గ్రీకు వీరుడు ల‌ను త‌ల‌చుకొంటూ కుర్ర కారు కాలం గ‌డిపేస్తుంది. వాళ్ల పెళ్లి చేద్దాం అని ప్రయ‌త్నాల‌తో భేతాళుడ్ని త‌ల‌పించే పేరంట్స్ కు ఈ భావాలు కంటికి ఇంపుగా, పంటి కి రాయిలా తోస్తుంటాయి. ఈ ల‌క్షణాలు ఉన్న జోడీ ని తెచ్చేద్దామ‌ని స్పీడ్ గా ప్రయ‌త్నిస్తుంటారు కానీ, క్లచ్ ప్లేట్ లు అరిగిపోయిం త‌ర్వాత‌...వీళ్లకు పెళ్లి ఎప్పుడు అవుతుంది దేవుడా అని బాధ ప‌డుతుంటారు. ఆ త‌ర్వాత మ్యారేజ్ బ్యూరోలు, వివాహ వేదిక‌లు, వివాహ ప్రక‌ట‌న‌లు వంటి మార్గాల్లో అన్వేష‌ణ సాగుతుంది. మ్యాచెస్ ఆర్ మేడిన్ హెవెన్ కాబ‌ట్టి దేవుడు నిర్ణయించిన స‌మ‌యానికి క‌రెక్టగా పెళ్లి అయిపోతుంది. అదృష్టం బాగుంటే మెనూ లో ల‌క్షణాల‌న్నీ స‌రిపోతాయి, లేదంటే అవ‌త‌ల వారికి ల‌క్షణాలు నేర్పే ప్రయ‌త్నం చేస్తారు. లేదంటే వ‌చ్చే వాడి దుంప తెగుతుందని సుమ‌తీ శ‌త‌కంలో ఉండి ఉండ‌వ‌చ్చు.

ష‌రాతు.. ప్రేమ పెళ్లి విష‌యంలో ఈ ల‌క్షణాల గోల వ‌ర్తించ‌దు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగ‌ది అని ప్రేమ శాస్త్రం ఘోషిస్తుంది. కానీ సినిమాల్లో ప్రేమ‌జంట‌లు అచ్చు ఈ ల‌క్షణాల‌తోనే ఉంటాయి ఎందుకో తెలీదు.
ప్రేమించుకొన్నాం,,ఇక‌పెళ్లి కార్డు ఇవ్వ‌ట‌మే త‌రువాయి అన్న రేంజ్ లో రెచ్చిపోయి చెట్టా ప‌ట్టాలేసుకొని తిరిగి, ఇప్పుడు తూచ్‌..వాళ్లెవ‌రో మాకు తెలీదు అన్న రేంజ్ లో తిరుగుతున్న కొన్ని జోడీ ల ఫోటోలు దొరికాయి. ఈ గ్లామ‌ర‌స్ జంట ల్ని మీరు చూడ‌వ‌చ్చు...pl. visit - http://www.godavariyouth.com/m/photos/home/
................................................

No comments:

Post a Comment