సినిమా నటుల తో క్యాలండర్లు తీయడం మన చిన్నప్పటి నుంచీ చూస్తున్నాం. రత్నాజీ రూపొందించిన రత్నాల క్యాలండర్ లో కూడా హిందీ హీరోయిన్ లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ, ఇందులో విశేషం ఏమిటంటే.. హిందీ ఆర్టిస్ట్ ల డిఫరెంట్ మూడ్స్ ను కెమెరాలో బంధించి,, ఆ ఫోటోలతో ఈ క్యాలండర్ రూపొందించారు. ఇందు కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కానీ, చూడగానే ఈ క్యాలండర్ అందరినీ ఆకర్షిస్తుందని వేరే చెప్పనక్కర లేదు.
అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లతో పాటు కత్రినా కైఫ్, కాజోల్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి భామల చిత్రాలు ఉన్నాయి. అభిమానులు ఈ క్యాలండర్ చూసి పండుగ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment