ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Wednesday, January 19, 2011

వెన్నెల్లో గోదారి అందం.. త‌ల‌చుకొంటే గుర్తొచ్చే అంద‌మైన స్టోరీ(ఇవాళ పౌర్ణ‌మి క‌దా...)


వెన్నెల్లో గోదారి అందం - నిజంగానే ఎంత అంద‌మైన ప‌ద‌బంధం. వెన్నెల‌, గోదారి రెండింట్లో ఏది అందమైన‌ది అని రెండు వేళ్లు చూపెడితే రెంటినీ ప‌ట్టేసుకోవాల‌ని అనిపిస్తుంది. గోదారిని త‌ల‌చుకొంటేనే ఒక అంద‌మైన పుల‌కింత‌, ఒక అద్భుత‌మైన అనుభూతి. మెరిసిపోతున్న వెన్నెల కాంతుల్లో గోదావ‌రి.. అంద‌మైన పూబంతి అవుతుంది. అంత‌కు మించి అందాల చామంతి అవుతుంది. పౌర్ణ‌మి రోజున గోదావ‌రిని చూస్తే.. వ‌య్యారి గోదార‌మ్మ‌, వెన్నెల్లో ఎందుక‌మ్మ ప‌ర‌వ‌శం అని మ‌నం డౌట్ అడిగేయ‌చ్చు. ఆ వ‌య్యారి న‌డ‌క‌ను చూస్తే - క‌నులు ప‌క్క‌కు తిప్ప‌లేం. ఎందుకంటే వెన్నెల ను చూడ‌గానే గోదార‌మ్మ నిజ్జంగానే ప‌ర‌వ‌శించిపోతుంది. అందుకే ఉప్పొంగెనే గోదావ‌రి అన్న మాట‌ను నిజం చేస్తూ ఉర‌క‌లేస్తుంది. ఈ అంద‌మైన దృశ్యాన్ని ఒడిసిప‌ట్టి మ‌న‌సు అనే సీపీయూ లో సేవ్ చేసుకొంటే ఎన్నిసార్ల‌యినా రిఫ్రెష్ బ‌ట‌న్ తో రిఫ్రెష్ కావ‌చ్చు. రాజ‌మండ్రి దిగువ‌న లంక‌ల్లోంచి గోదారిని చూడ‌టం ఒక ఎత్త‌యితే, దిగువ‌గా కోటిప‌ల్లి రేవులో అల‌ల్ని తాకుతూ ఆస్వాదించ‌టం మ‌రొక ఎత్తు. ఎం త చూసినా త‌రిగిపోని అందం ఏద‌ని ఎస్ ఎమ్ ఎస్ ప్ర‌శ్మ అడిగితే గోదార‌మ్మ అని ఏకైక జ‌వాబు రాసేయ‌చ్చు. కావాలంటే పున్న మి వెన్నెల్లో ఇసుక తిన్నెల‌పై న‌డుస్తూ మార్కులు వేసుకొమ్మ‌ని స‌ల‌హా ప‌డేయ‌చ్చు. వెండి గిన్నెల్లో చంద్రుడ్ని చూసిన‌ట్లు,, గోదార‌మ్మ కెర‌టాల మీద వెన్నెల కాంతుల్ని చూస్తే... లోకం ఒక్క‌సారి ఆగిపోయిన‌ట్లు అనిపిస్తుంది. సృష్టిలోని అంద‌మంతా క‌నుచూపు మేర ప‌రుచుకొన్న‌ట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా గ‌ల‌గ‌ల‌ల శ‌బ్దం చెవుల‌కు ఇంపుగా వినిపిస్తుంటే .. అందమే అనందం అన్న మాట నిజ‌మ‌నిపిస్తుంది. గోదారి గ‌ట్టు వెంట ఒంట‌రిగా చ‌క్క‌ర్లు కొట్టిన దానికి, జంట‌గా షికారు చేసిన దానికి బోలెడంత డిఫ‌రెన్సు క‌నిపిస్తుంది. ఇద్ద‌రం క‌లిసి నెమ్మ‌దిగా న‌డుస్తూ... అడుగులో అడుగులు వేసుకొంటూ, మ‌ధ్య‌లో చేతిలో చేతిని సుతి మెత్త‌గా క‌లుపుకొంటూ న‌డుస్తుంటే మాట‌లు త‌డ‌ప‌డ‌తాయి. ఎన్నెన్నో ఊసులు చెప్పుకోవాల‌ని, చెవిలో చెవేసుకొని గుస‌గుస‌లాడుకోవాలని త‌లంపు ఉన్నా..మౌనంగా మ‌న‌సు ప‌లికే రాగాలు వింటూ కాలం గ‌డ‌పాల్సిందే. ((వెన్నెల్లో గోదారి అందాల్ని ఒడిసిప‌ట్టిన ఒక క‌పుల్ అభివ‌ర్ణించిన అనుభూతుల ప‌ల్ల‌వి.. www.godavariyouth.com లో ఆర్టిక‌ల్స్ పేజీలో చూడ‌చ్చు. టైటిల్ - వెన్నెల్లో గోదావ‌రి, ఒక తేనేచంద్రం ))ఏడాదికోసారైనా కాంక్రీట్ జంగిల్ నుంచి పారిపోవాల‌ని, వెన్నెల్లో గోదారి అందాల్నిఒడిసి ప‌ట్టాల‌ని బ‌లంగా అనిపిస్తుంది. మ‌రి ముఖ్యంగా ప్ర‌తీ పౌర్న‌మికి ఈ ప్రామీస్ చేసుకోవ‌టం, వ‌చ్చే పున్న‌మి రోజు మ‌ళ్లీ దాన్ని గుర్తు చేసుకోవ‌టం ఆన‌వాయితీ అయిపోయింది.ఈ సారైనా గోదార‌మ్మ ద‌ర్శ‌నం జ‌రిగితే ఎంత బాగుండు, ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటే ఈ రాత్రి పున్న‌మి రాత్రి కాబ‌ట్టి..

Tuesday, January 18, 2011

స‌ఖి సినిమాలోని స్నేహితుడా.. ర‌హ‌స్య స్నేహితుడా.. పాట వింటే పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయి...


అర్థ‌రాత్రి వేళ మా మ్యూజిక్ ఛానెల్ లో స్నేహితుడా.. ర‌హస్య స్నేహితుడా .. పాట ప్లే అవుతోంది. ఆఫీసు లో హెడ్ లైన్స్ పెట్ట‌డానికి అయిడియా రాక త‌న్నుకొంటుంటే ఈ పాట చెవుల‌కుసోకింది. కాసేపు మ‌న‌సు కాలేజీ రోజుల‌కు వెళ్లిపోయింది. స‌ఖి సినిమా క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంటే కాలేజీ హ్యాపీ డేస్ లో మా ఫ్రెండ్‌ ప్రేమ క‌థ‌, పెళ్లి గాథ వ‌రుస‌గా గుర్తుకొని వ‌చ్చాయి. బులెటిన్ కు హెడ్ లైన్స్ పెట్టే ప‌ని కాసేపు వాయిదా వేసి.. ఆ హ్యాపీడేస్ ను త‌ల‌చుకొన్నా...
గోదావ‌రి జిల్లా లో పెద్ద‌గా ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకోని గ్రామం మాది. అక్క‌డ నుంచి కాలేజీ కి ప‌ది కిలోమీటర్లు .. పొలోమ‌ని సైకిల్ తొక్కుకొంటూ వెళ్లటం చాలా చాలా కామ‌న్ విష‌యం. ఉద‌య‌మే చ‌ద్ద‌న్నం తిని పుస్త‌కాలు సైకిల్ కి పెట్టుకొని బ‌య‌లు దేరితే .. పొలాల మ‌ధ్య నుంచి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కామ‌న్న‌ది వీర‌త్వానికి ప్ర‌తీక‌. ఇంట‌ర్మీడియ‌ట్, అది అయ్యాక డిగ్రీ చ‌దివేయ‌ట‌మే త‌ప్ప అది చెయ్యాలి, ఇది పొడిచెయ్యాలి అని పెద్ద‌గా టార్గెట్ లు లేని ప్ర‌శాంత జీవితం అది. అస‌లు డిగ్రీ అయ్యాక జీవితాన్ని ఎలా గ‌డ‌పాలి అనే దాని మీద కూడా స్ప‌ష్టమైన అయిడియా లేని నిఖార్స‌యిన తాజా లైఫ్.
బీఎస్సీ అంటే స‌గం థీరీ క్లాసులు, స‌గం ప్రాక్టిక‌ల్ క్లాసుల‌తో తెల్ల‌వారే జీవితాలు. అందునా బ‌యాల‌జీ ల్యాబ్ లో స్టూడెంట్స్ అంతా ఒక చోట చేరి ల్యాబ్ లో కుస్తీ పట్టాల్సిందే క‌దా..స‌హ‌జంగానే రికార్డులు రాయ‌టం ద‌గ్గ‌రకు వ‌చ్చే స‌రికి బొమ్మ‌లు బాగా గీసేవారికి క్రేజ్ ఉండేది. బాగా డ్రాయింగ్ వ‌చ్చిన వారి బ‌తిమాలుకొని, మ‌న రికార్డ్ షీట్ ల మీద కూడా వాళ్ల చేత ర‌ఫ్ లైన్ గీయించుకొని,ఆ త‌ర్వాత ఫెయిర్ చేసుకొని మిగిలిన వారంతా ల్యాబ్ లోకి ప‌రుగులు తీయ‌టం రివాజు. ఈ క్ర‌మంలో మా క్లాసు లో జిమ్మీ కార్ట‌ర్ కు మంచి క్రేజ్ ఉండేది. జిమ్మీ బొమ్మ‌లు గీయ‌టం, పాట‌లు పాడ‌టం, క‌విత్వం రాయ‌టం వంటి క‌ళ‌ల్లో ఆరి తేరిన వాడు. అసువుగా పాట‌లు పాడేస్తూ. అందరి ద‌గ్గ‌ర మంచి గుడ్ విల్ సంపాదించుకొన్నారు. ఇక‌, మాబ్యాచ్ లోనే ఉండే అనిత కూడా డ్రాయింగ్ అవ‌స‌రాల కోసం జిమ్మీ తో స్నేహంగా ఉండ‌టం మొద‌లైంది. ఫ‌స్టియ‌ర్ లో ల్యాబ్ లో టేబుల్స్ పంచుకొనేట‌ప్పుడు అనిత‌, జిమ్మి, మ‌ధ్య‌లో నేను ఒక టేబుల్ తీసుకొన్నాం. కాలేజీలో ఉన్నంత సేపు హాయిగా స్టూడెంట్ లైఫ్ ని లీడ్ చేసేవాళ్లం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా జిమ్మీ .. పాట‌లు పాడుతూ ఉత్సాహ ప‌రిచేవాడు. ఇక డిసెక్ష‌న్ లు చేయటం, ప్రాక్టిక‌ల్స్ చేయ‌టంలో అనిత మంచి ఎక్స్ ప‌ర్ట్. సో, ఇద్ద‌రి ద‌గ్గ‌ర స‌హాయం పొందుతూ నేను బండి లాగించేస్తూ.. ముందుకు సాగిపోయాం.
ఫ‌స్టియ‌ర్ దాటి సెకండియ‌ర్ కొచ్చేస‌రికి ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒక‌ట‌య్యారు. ఫ్రెండ్ షిప్ నుంచి ల‌వ్ షిప్ లోకి ఎంట‌ర‌య్యేస‌రికి మ్యాట‌ర్ కాస్త కాలేజీ అంతా పాకిపోయింది. అనిత తెల్ల‌టి తెలుపుతో మ‌ల్లెపువ్వులా ఉంటే, మా జిమ్మీ చ‌క్క‌టి న‌లుపుతో మెరిసిపోయేవారు.
అంత చ‌క్క‌టి తెలుపుకి, ఇంత చిక్క‌టి న‌లుపుకి ఎలా కుదిరింద‌బ్బా.. అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు కానీ, నేను మాత్రం ఏమాత్రం ఆశ్చ‌ర్య పోలేదు. స‌రికదా... చాలా సంతోషించాను. ఒకే మ‌న‌స్త‌త్వం, ఒకే సున్నిత‌త్వం క‌ల వాళ్లు క‌లిస్తే.. జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమా అంత స్వ‌చ్చంగా ఉంటుంది క‌దా..బీఎస్సీ చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి పీక‌ల్లోతు ప్రేమ లో మునిగి పోయిన మా ఫ్రెండ్స్ ఇద్ద‌రికీ, బాధ్య‌త‌లు మాత్రం గుర్తు ఉన్నాయి.

స‌ఖి సినిమా లోమాదిరిగానే ఇద్ద‌రూ పెళ్లి ని వాయిదా వేసి , కెరీర్‌ను న‌డిపించాల‌నుకొన్నారు. జిమ్మీ ఎమ్మెస్సీ కోసం ఆంధ్రా యూనివ‌ర్శిటీ కి వెళితే, అనిత బీ ఎడ్ కోసం ప్ర‌కాష్ కాలేజీ కి వెళ్లారు. ఈ కోర్సు లు పూర్తి కాగానే పెళ్లి ఘ‌డియ త‌రుముకొంటూ వచ్చేసింది. పెద్ద‌ల‌కు ఇష్టం లేని పెళ్లి కావ‌టంతో, కష్టంతోనే పెళ్లి చేసుకొన్నారు. మేం ఇంకా ఉద్యోగాల్లో ఇంకా కుద‌రుకోక‌పోవ‌టంతో త‌లో చేయ వేయ‌గ‌లిగాం త‌ప్పితే , ఫైనాన్షియ‌ల్ గా ఏమాత్రం ఆదుకోలేక పోయాం. దీంతో సినిమా మాదిరిగానే ఇరుకు గ‌దిలోనే లైఫ్ ను స్టార్ట్ చేశారు. చిన్న కుటుంబం, చీకు చింతా ఉన్న కుటుంబం గా ఉండేది. అడ‌పా త‌డ‌పా చిన్న చిన్న వ‌స్తువులు కొనుక్కొంటూ.. దిసీజ్ ద రిథ‌మ్ ఆఫ్ లైఫ్ అనిపించారు. ఈలోగా జ‌ర్న‌లిస్టు ఉద్యోగం రావ‌టంతో నేను హైద‌రాబాద్ కు ట‌పా క‌ట్టేశాను. ఇంటికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా.. జిమ్మీ-అనిత జంట‌ను క‌ల‌వ‌టం మాన‌లేదు.

ఆ త‌ర్వాత రిలీజైన స‌ఖి సినిమా ను చూశాక‌, థియోట‌ర్ లోనే టెన్స్ అవ్వాల్సి వ‌చ్చింది. చాలా చోట్ల మా ఫ్రెండ్స్ తో పోలిక ఉండ‌టం, సున్నిత‌మైన ల‌వ్ ట‌చ్ ఉండ‌టం బాగా గుర్తుండేలా చేసింది. అయిన వెంట‌నే ఇంటికి లెట‌ర్ రాశా. వెంట‌నే తిరుగు లేఖ వ‌చ్చేసింది. నా లెట‌ర్ తో రెస్పాండ్ అయిన మా జేసీ .. సినిమా చూడ‌టం, పోల్చుకోవ‌టం చ‌క చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. సెల‌వుకి ప్ర‌త్యేకంగా ఇంటికి ర‌మ్మని ఒక ఇన్విటేష‌న్ కూడా తోడ‌యింది. ఆ త‌ర్వాత సెల‌వు పుచ్చుకొని గౌత‌మీ ఎక్కి, ఇంటి ద‌గ్గ‌ర వాలిపోయా. అప్ప‌టికే మా ఇంటి దగ్గ‌ర నా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌స్తుండేది. అప్ప‌ట్లో నేను పెళ్లి చేసుకొనేందుకు బాగా దూరంగా ఉండేవాడిని, ఈ విష‌యంలో నాకు కొన్ని అంచ‌నాలు ఉండేవి.. (ఇటువంటి పెళ్లి అంచ‌నాల‌తో కూడిన ఆర్టిక‌ల్ మీరూ చ‌ద‌వ‌చ్చు.. దాని పేరు - పెళ్లీ నీకో న‌మ‌స్కారం..http://www.godavariyouth.com/m/articles/view/--2010-12-22. )). దీంతో నా పెళ్లి వాయిదా ప‌డుతూ వ‌స్తుండేది. మా ఫ్రెండ్స్ మాత్రం చ‌క్క‌గా వైవాహిక జీవితంలో కుదురుకొన్నారు. కొంత కాలానికి బాబు పుట్టాడు. అప్పుడు రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు కూడా ఈ జంట‌ను ఆశీర్వ‌దించారు. దీంతో అస‌లైన హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయ‌న్న మాట‌. ఈ మొత్తం ఎపిసోడ్ ను గుర్తు చేసుకొంటూ.. మ‌ళ్లీ బులెటిన్ ప‌నిలో ప‌డ్డా..

Thursday, January 13, 2011

మకర జ్యోతిని దర్శించేందుకు అయ్యప్ప సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల అటవీ మార్గంలో ఉన్న విశేషాలు



చూడగానే భక్తి భావం కల్పించే అయ్యప్ప దీక్స చేయటం ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఆ తర్వాత శరణాలు పలుకుతూ శబరిమలై వెళ్లి, మకర జ్యోతిని దర్శించి రావటం ఇంకెంతో మధురానుభూతి. ఎక్కడో కేరళ అడవుల్లో కొలువున్న స్వామిని దర్శించుకొనేందుకు ఇన్ని లక్షల మంది దీక్ష చేసి వెళ్లటం ఎందుకు, ఇతర పుణ్యక్షేత్రాలు దర్శనానికి లేనట్లుగా అయ్యప్ప ను దర్శించేందుకు ఇన్ని నియమావళి ఎందుకు, స్వామి సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల పెద్ద పాదం అటవీ మార్గంలో ఉన్న విశేషాలు ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం. ( to read this article, pl. visit.... http://www.godavariyouth.com/m/news/view/--2010-12-25 ))))))

Wednesday, January 12, 2011

ప్రేమ లేఖ రాశా..ఎవ‌రికి అంది ఉంట‌ది..



మౌన‌మే నీ భాష ఓ మూగ మ‌న‌సా...అన్నట్లుగా మూగ మ‌న‌సులోని భావాల్ని ఒడిసి ప‌ట్టి ఒక చోట చేరిస్తే ప్రేమ లేఖ అవుతుంద‌ని మ‌న‌కు తెలుసు. ప్రేమ లేఖ అన‌గానే ఎన్నెన్నో ఊసులు... మ‌రెన్నో బాస‌లు... వెర‌సి కొన్ని గుస గుస‌లు అనుకొంటాం. కానీ, ఇందులో భావాలు, అనుభూతులు, స్పంద‌న‌లు దోచూచులాడ‌తాయి. ఇన్ని స్పంద‌న‌ల్ని ప‌లికించాలంటే ప్రేమ లేఖ రాయ‌టం తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం కొన్ని సైట్ లు చూస్తే ఒక ఆర్టిక‌ల్ దొరికింది.. (మీరూ చద‌వ‌చ్చు..http://www.godavariyouth.com/m/articles/view/--2011-01-11.)
ఈ ఆర్టిక‌ల్ కు కాస్త మ‌న సైడు నుంచి భావుక‌త జోడించాలి. అప్పుడే సొంత లేఖ అవుతుంది. లేదంటే ఎరువు లేఖ అయిపోయి, ఎరువు రాత‌గాడికి ఫీలింగ్స్ సొంతం అయిపోవ‌చ్చు..

Monday, January 10, 2011

ర‌త్నాల క్యాలండ‌ర్..

సినిమా న‌టుల తో క్యాలండ‌ర్లు తీయ‌డం మ‌న చిన్నప్పటి నుంచీ చూస్తున్నాం. ర‌త్నాజీ రూపొందించిన ర‌త్నాల క్యాలండ‌ర్ లో కూడా హిందీ హీరోయిన్ లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ, ఇందులో విశేషం ఏమిటంటే.. హిందీ ఆర్టిస్ట్ ల డిఫ‌రెంట్ మూడ్స్ ను కెమెరాలో బంధించి,, ఆ ఫోటోల‌తో ఈ క్యాలండ‌ర్ రూపొందించారు. ఇందు కోసం ఆయ‌న ప‌డిన శ్రమ అంతా ఇంతా కాదు. కానీ, చూడ‌గానే ఈ క్యాలండ‌ర్ అంద‌రినీ ఆక‌ర్షిస్తుంద‌ని వేరే చెప్పన‌క్కర లేదు.
అమితాబ్ బ‌చ్చన్‌, షారూక్ ఖాన్‌, హృతిక్ రోష‌న్‌, స‌ల్మాన్ ఖాన్ ల‌తో పాటు క‌త్రినా కైఫ్‌, కాజోల్, క‌రీనా క‌పూర్‌, ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొనే వంటి భామ‌ల చిత్రాలు ఉన్నాయి. అభిమానులు ఈ క్యాలండ‌ర్ చూసి పండుగ చేసుకోవ‌చ్చు.

Saturday, January 8, 2011

బిగ్ బాస్ గా ఈ అమ్మాయా....కోటి రూపాయ‌ల బ‌హుమ‌తా..




బిగ్ బాస్ గా ఎప్పుడూ కాల‌రెగ‌రేసే అబ్బాయిల్ని కాద‌ని ఒక‌మ్మాయి ఇప్పుడు చున్నీ ఎగరేస్తోంది. అది కూడా ట‌ఫ్ ఫైట్ ను దాటుకొని నిన్న రాత్రి శ్వేతా తివారీ అనే శ్వేత (తెల్ల) రంగు అమ్మాయి నెంబ‌ర్ వ‌న్ అయిపోయింది. అక్షరాలా కోటి రూపాయలు కొట్టేసింది. హిందీ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్స్ దున్నేసే వారికి ఈ కాంపిటీష‌న్ ఏమిటో వేరే చెప్పక్కర‌లేదు. (మిగిలిన వారి కోసం ఒక ముక్క‌...క‌ల‌ర్స్ హిందీ చానెల్ లో 19 వారాల పాటు న‌డుస్తున్న ఎపిసోడ్ లో రాత్రి జరిగిన ఫైన‌ల్స్ లో బిగ్ బాస్ ను ఎంపిక చేశార‌న్న మాట )

అసలు ఈ ఫైన‌ల్ మీద నిన్న ఉద‌యం నుంచీ మంచి సస్పెన్స్ నెల‌కొంది. జోష్ గా ఉండే కుర్రకారు , ముఖ్యంగా అమ్యాయిలు దీని మీద సెల్ ఫోన్ ల‌తో బోలెడు సేపు వాద‌న‌లు సాగించారు. ఇక‌, మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌లు ఎప్పటి లాగే ల్యాండ్ లైన్ ఫోన్ వాడుకొంటూ దీని మీద మాట్లాడుకొన్నారు. మ‌ల్ల ఫైటింగ్ హీరో గ్రేట్ ఖ‌లీ నెగ్గుతాడ‌ని చాలామంది అనుకొన్నారు. కానీ, ఈ లోగా లేచింది .. నిద్ర లేచింది మ‌హిళా లోకం అన్న పాట బ్యాక్ డ్రాప్ లో ప్లే అయ్యే స‌రికి మ‌హిళా లోకం మేలుకొంది. క‌ట్ చేస్తే ఎస్ ఎమ్ ఎస్ లు వ‌ర‌ద‌లా వ‌చ్చేశాయి. టీవీల్లో సీరియ‌ల్స్ లో న‌టించే బ్రాండ్ లేడి శ్వేతా తివారీ - బిగ్ బాస్ గా ఎన్నిక‌య్యారు. మొద‌టిసారిగా ఒక మ‌హిళ దీన్ని గెలుచుకొన్నారు. కోటి రూపాయలు తీసుకొని, షెవ‌ర్లే కారు లో ర‌య్యిన దూసుకెళ్లారు.((భ‌ర్త వ‌ద్దు,, విడిపోవ‌ట‌మే ముద్దు అంటున్న శ్వేతా తివారి-అనే ఆర్టిక‌ల్ ను చూడాలంటే www.godavariyouth.com అనే వెబ్ సైట్ లో controversy సెక్షన్ చూడండి )).................................................

Friday, January 7, 2011

ఒక రాధ, అయిదుగురు క్రష్ణులు..ఇది కలియుగమే...



చాలా కాలం క్రితం ఒక రాధ, ఇద్దరు క్రష్ణులు సినిమా చూశాం. కానీ, ఒకే అమ్మాయి అయిదురుగు అబ్బాయిలతో ప్రేమాయణం సాగించిందని తెలిసినప్పుడు ఇదేమిటబ్బా అని ఆసక్తి గా చూశా. అది కూడా ఒక సినీ హీరోయిన్ నిజ జీవితంలో సాగించిన లవ్ ఎపిసోడ్స్ కావటంతో సహజంగానే ఇంట్రస్ట్ అనిపించింది. ఇంటర్ నెట్ లోనే ఈ సమాచారం గుది గుచ్చి ఆర్టికల్ రూపంలో ఉండటంతో మ్యాటర్ పూర్తి గా అర్థం అయింది. హిందీ హీరోయిన్ దీపికా పదుకొనే రీలు లైఫ్ లో కూడా రొమాంటిక్ హీరోయిన్ అనిపించుకొన్నట్లుగా ఈ ఆర్టికల్ లో వర్ణించారు. దీపికా మొదట్లో మోడల్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె ఉపేన్ పటేల్ తో క్లోజ్ గా ఉండేదట. తర్వాత సినిమాల్లోకి వచ్చాక.... క్రికెటర్ యువరాజ్ సింగ్ తో జోడీ కట్టింది. ఆపై దోనీతో కొంతకాలం దోస్తీ చేసింది. ఓం శాంతి హిట్ తర్వాత ఆమె గ్లామర్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి..మొన్నీ మధ్య దాకా రణ్ భీర్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేది. తాజాగా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ మాల్యా అని లెక్క తేలింది. మొత్తం మీద అయిదుగురు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చింది. ఇప్పటి దాకా దీపికా కౌంట్ ఐదుగురు అని తేలింది. అధికారిక లెక్కలకే పరిమితం అయినందున ఈ సంఖ్యను ఇలా ఉంచటమైనది..(దీపిక ఏ ఏ బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడెక్కడ ఫోజులు ఇచ్చిందో మీరు కూడా చూడవచ్చు..http://www.godavariyouth.com/forum/groups/forum/Controversy-0.htm )ఎవరి వ్యక్తి గత జీవితాలు వారిష్టం. మనం కామెంట్ చేయకూడదు. కలికాలంలో ఇవన్నీ కామన్ అని చాదస్తులు సరిపెట్టుకోవచ్చు గాక..